చిరంజీవి సినిమాలలో బన్నీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మూవీస్ ఇవే…!

స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకున్న ఈయన.. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ముఖ్యంగా ఈన నటుడిగా జాతీయ ఉత్తమ అవార్డుని సైతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ అవార్డు ని తెలుగు సినీ చరిత్రలో ఏ హీరో కూడా అందుకోలేదు. అలాంటి అవార్డు అల్లు అర్జున్ అందుకోవడంతో ఈయన ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.

 

 

ఇక ఈ విషయం పక్కన పెడితే… అల్లు అర్జున్, చిరంజీవి నటించిన సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు బన్నీ. అలాగే డాడీ మూవీలో కూడా నటించాడు. ఇక ఈ సినిమాలో బన్నీ నటన చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారట. అంత గొప్పగా నటించేవాడట బన్నీ. ఇక అదే నటన తన పెద్దయిన తర్వాత కూడా చూపించి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్.. చిరంజీవితో విజేత సినిమాలో చేసే టైంలో చిన్నబ్బాయి. అయితే ఈ విజేత సినిమాకు సంబంధించిన 100 డేస్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ ఒక షీల్డ్ అందుకున్నారు. అయితే ఈ షీల్డ్ సంబంధించిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ..” నేను నటించిన మొట్టమొదటి సినిమా విజేత. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా మా నాన్నే చేశారు. అయితే ఎన్ని సంవత్సరాలుగా నేను గ్రహించింది ఏమిటంటే.. ఈ సినిమాలో నేను నటించినందుకు మా నాన్న నాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు ” అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.