నితిన్ కావాల‌నే ఇరికించాడు…. మ్యాడ్ ప్రొడ్యుస‌ర్ షాకింగ్ రిప్లై…!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా.. శ్రీ లీల హీరోయిన్గా.. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ” . ఇక ఈ సినిమాపై క్రేజీ బజ్ నెలకొల్పిన మేకర్స్.. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక హీరో నితిన్ స్వామి వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ ..” మన సినిమా చూసి ఎవరైనా ఫుల్ గా ఎంటర్టైన్ కాలేదు అంటే.. మీ టికెట్ డబ్బులు ప్రొడ్యూసర్ నాగవంశీ వెనక్కి ఇస్తాడు. మా ఇద్దరి మధ్య చాలా లావాదేవులు ఉన్నాయి ” అంటూ నితిన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇదే స్టేట్మెంట్ ని నాగవంశీ గతంలో తాను డైరెక్ట్ చేసిన ” మ్యాడ్ ” సినిమా రిలీజ్ టైం లో కూడా ఇచ్చాడు. ఈ సినిమా చూసి ఎవరైనా నవ్వుకోలేదు అంటే మీ డబ్బులు మీకు వెనక్కిస్తా అంటూ.. గతంలో నాగవంశీ చెప్పుకొచ్చాడు.

ఇదే స్టేట్మెంట్ నితిన్ చెప్తూ.. నాగవంశీని ఇరికించడం మంచి ఫన్ గా మారింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నాగ వంశీ దీనిపై స్పందించాడు. ” ఆరోజు మ్యాడ్ వైబ్ లో అలా అనేసాం నితిన్ స్వామి… ఇప్పుడు మీరు ఇలా లాక్ చేస్తే ఎలా? ” అంటూ నాగవంశీ ఫన్ రిప్లై ఇచ్చాడు. ఇక ప్రస్తుతం నితిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.