రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన కాంతారా రిష‌బ్‌శెట్టి… స్టార్ హీరోల‌ను మించిపోయాడుగా..!

కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి మనందరికీ సుపరిచితమే. ఈయన కష్టంతో ఊహించని స్థాయిలో పేరు పొందారు. ప్రస్తుతం కాంతారా సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యి రిషబ్ స్టార్ హీరో అవ్వాలని ఈయ‌న‌ అభిమానులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈయన రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

కాంతారా సినిమాకు రిషబ్ శెట్టి కేవలం 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోగా.. కాంతారా సీక్వెల్ కి మాత్రం ఏకంగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట రిషబ్. ఒకేసారి 25 రెట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ పెంచడం..ఒక్క‌ రిషబ్ కే సాధ్యమైందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ రేంజ్ రెమ్యూనరేషన్ స్టార్ హీరోలకి కూడా లేదేమో.. అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక కాంతారా సీక్వెల్ కూడా సూపర్ డూపర్ హిట్ అయితే.. ఈయన ఇంకెంత రెమ్యూనరేషన్ పెంచేస్తాడో. ఇక ప్రస్తుతం రిషబ్ కాంతారా సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన రెమ్యూనరేషన్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.