యూఎస్‌లో స‌లార్ దెబ్బ ఎలా ఉందో తెలుసా… మ‌న డార్లింగా మ‌జాకానా…!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రియాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం పోనివ్వకుండా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది.

 

ఇక ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినా ఈ మూవీ ఒక్క తెలుగులోనే సంచలనం సృష్టించడమే కాకుండా యూఎస్ మార్కెట్లో కూడా భారీ స్థాయి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ ఏడాదికి యూఎస్ లో బిగ్గెస్ట్ ప్రీమియర్స్ అందుకున్న మూవీగా నిలిచిన సలార్ ఇప్పుడు యూఎస్ లో వీకెండ్ కంప్లీట్ కాకుండానే సెన్సేషనల్ రన్ తో దూసుకుపోతుంది.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ మూవీ 4.72 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు చేసినట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ వీకెండ్ నాటికి సలార్ 6 మిలియన్ మార్క్ ని టచ్ చేసే దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. ఇక మొత్తానికి యూఎస్ మార్కెట్లో మాత్రం చాలా సలారోడి హవా ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.