నేషనల్ క్రష్ సంపాదన ఎంతో తెలుసా.. కార్ల కలెక్షన్ల వాటి కాస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..?!

నేషనల్ క్రష్ రష్మిక 1996లో పుట్టింది. కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ అక్కడ వరుస అవకాశాలను అందుకుంది. తర్వాత టాలీవుడ్‌కి అడుగుపెట్టి ఛ‌లో సినిమాలో ఆమె నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత గీత గోవిందం సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుని వరుస‌ సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నటించిన నేషనల్ క్రష్‌ బిరుదును అందుకుంది. దీంతో బాలీవుడ్ లో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి.

బాలీవుడ్ స్టార్ హీరోని ర‌ణఃబీర్‌ కపూర్ సరసన యానిమల్ సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మికకు వరుస సినిమా అవకాశాలు క్యూ కడుతున్నట్లు టాక్. అయితే ఈ రేంజ్ లో సక్సెస్ అందుకున్న రష్మిక మందన సంపాదన ఎంతై ఉంటుంది, ఆమె కార్స్ కలెక్షన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ ఆర్టికల్ లో ఆ విష‌యాలు తెలుసుకుందాం. నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి దాదాపు రూ.45 కోట్ల ఆస్తి వరకు కూడబెట్టిందట.

ఆమె నెలసరి ఆదాయం రూ.60 లక్షలకు పైగా ఉంటుందని టాక్. ఆమె వార్షికఆదాయం రూ.8కోట్లు కాగా నెలసరి ఆదాయం రూ.60 లక్షలకు పైగా ఉంటుందని టాక్. ఆమె వార్షిక ఆదాయం 8 కోట్లు కాగా సౌత్ ఇండస్ట్రీలో అత్యధికమైన రేషన్ తీసుకుంటున్న టాప్ టెన్ హీరోయిన్స్ లో రష్మిక కూడా ఒకటి. ఒక్క సినిమాకి దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రెమ్యున‌రేషన్ డిమాండ్ చేస్తుందట ఈ ముద్దుగుమ్మ‌. యానిమల్ సక్సెస్ తర్వాత ఆమె రెమ్యునరేషన్ మరింతగా పెంచేసింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆస్తులను కొనుగోలు చేసిన ఈ బ్యూటీ ముంబైలో ఓ విలాసమంతమైన అపార్ట్మెంట్ కూడా సొంతం చేసుకుంది. రూ.8 కోట్ల విలువైన బంగ్లా, గోవా, కూర్గ్, హైదరాబాద్లలో అద్భుతమైన ఆస్తులు సంపాదించుకుంది. ఇక కార్స్ కలెక్షన్.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ – రూ.1.84 కోట్లు, ఆడి క్యూ 3 -రూ.52 ల‌క్ష‌లు, మెర్సిడెస్ బెంజ్ క్లాస్ – రూ.42 ల‌క్ష‌లు, టయోటా ఇన్నోవా – రూ.21 ల‌క్ష‌లు , హ్యుండై క్రెటా – రూ. 19.20 ల‌క్ష‌లు.. ఇలా ఎన్నో విలువైన కార్‌లు రష్మిక గ్యారేజ్ లో ఉన్నాయి.