Bigg Boss 7: ఈసారి టైటిల్ విన్నర్ అమర్ దీప్ ఏనా.. బిగ్ బాస్ బిగ్ స్కెచ్‌..?!

ప్రస్తుతం బిగ్‌బాస్ రాసవ‌తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫైనల్ వైపు అడుగులు వేస్తున్న బిగ్ బాస్ టైటిల్ పోరులో ఎవరు విన్ అవుతారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఒక్కొక్క కంటిస్టెంట్ హౌస్ జర్నీని చూపిస్తూ వచ్చాడు. బిగ్ బాస్ మొదటగా అమర్ జర్నీని చూపించగా అమర్ దీప్ గురించి మంచి ఎలివేషన్స్ ఇస్తూ స్క్రీన్ పైన, యాక్టివిటీ రూమ్‌లో, దీపాల మధ్యలో ఇలా అమర్ దీప్ ఎంతో హ్యాపీ జర్నీ చూపించారు. అమర్ ఫస్ట్ యాక్టివిటీ రూమ్ లోకి వెళ్లడం.. వెళ్లడమే హౌస్ లో ఉన్న తన మెమరీస్‌ని బిగ్ బాస్‌లో తన జర్నీ ఫోటోలని చూస్తూ వెళ్ళాడు.

ఇక అమర్ జర్నీ గురించి ఒకసారి చూస్తే ఫస్ట్ నుంచి కూడా జెంటిల్మెన్‌ల అమర్ ఆడలేదు. ఫాల్ గేమ్స్ ఆడాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదట్లో బుల్లితెర‌ హీరో అనగానే అతనిపై అరేంజ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అయితే ప్రేక్షకులు అనుకున్నంత బ్రేవ్ గా అతని ఆట కొనసాగలేదు. తింగరి తింగరిగా గేమ్ ఆడుతూ ఎప్పటికప్పుడు ట్రోలర్స్‌కు దొరికిపోతు వచ్చాడు. సీజన్ 5 లో వచ్చిన సన్నీని ఇమిటేట్ చేస్తూ ఆడాలని ప్రయత్నించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. ప్రతి టాస్క్ లో తన బుర్రకి తోచినట్లుగా తింగరి ఆటలు ఆడుతూ అందరికీ లోకువ‌య్యాడు.

ఇక వీకెండ్ ఎపిసోడ్స్ లో అందరికంటే ఎక్కువగా ఎప్పటికప్పుడు నాగార్జునతో క్లాస్ పీకించుకున్న కంటెస్టెంట్ అమరదీప్. ఇక దీంతో శివాజీ ప్రతిరోజు అమర్ పై సెటైర్లు వేస్తూ కామెడీ చేయడం మొదలుపెట్టారు. అయితే దీంతో హౌస్ బయట ఉన్న అమర్ ఫ్యాన్స్ కొంతమంది బాగా హర్ట్ అయ్యారు. వారిపై నెగటివ్ కామెంట్స్ కూడా చేశార‌రు. బిగ్‌బాస్ స్టార్టింగ్‌లో సందీప్ చాలా వరకు నామినేషన్స్‌లో లేకపోయినా అమర్ మాత్రం ఎప్పటికప్పుడు నామినేషన్స్ లో ఉంటూ సేవ్ అవ్వడం కూడా అందరికి ప్లస్ అయింది. అమర్ జర్నీలో సందీప్ ని చాలా తక్కువగా చూపించారు.

అలాగే శివాజీ సెటైర్స్‌ వేస్తూ అమర్ పై జోక్స్ వేసిన సంఘటనలు అసలు చూపించలేదు. అమర్ నెగిటివ్ అనిపించే సన్నివేశాలను వేటిని ఈ జర్నీలో చూపించలేదు. కేవలం అమర్‌ హీరోగా జెంటిల్మెన్ గా చేసిన జర్నీని మాత్రమే చూపిస్తూ శివాజీ తో ఉన్న మంచి కట్స్ చూపిస్తూ బిగ్‌బాస్ మెమరీస్ బుక్ పెట్టడం హైలైట్ అయ్యింది. సెట్టింగ్ చాలా బాగా వేశారు. లాస్ట్ వీక్ లో అందరు జర్నీ అయినా తర్వాత ఈ వీడియోలో మిస్సయిన కట్స్ అన్ని రీ యాడ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అయితే అమర్ జర్నీలో ఇంత పాజిటివిటీ రావడంతో ఇది అమర్ కు ఓటింగ్ విషయంలో ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. కావాలనే బిగ్ బాస్ అమర్‌ను విన్నర్ చేసేందుకు ఇలా మాస్టర్ ప్లాన్ వేశాడని అర్థమవుతుంది.

అయితే తర్వాత అర్జున్ జర్నీ చూపించారు ఇందులో అర్జున్ కటౌట్ చూసి అందరూ భయపడుతున్నది.. అతనిపై తలపడేందుకు వచ్చినవి.. ఫినాలే అస్త్ర సంపాదించడం ఇదే చూపించాడు. అయితే ఫినాలే ఆస్త్ర‌ అర్జున్ సాధించిన విధానంతో అర్జున్‌కి ప్లస్ అయింది. పల్లవి ప్రశాంత్‌ ఆర్గ్యుమెంట్స్ పాయింట్ లేకుండా తన టార్గెట్ చేయాలని అనుకున్న మాటలు.. ఇలా అర్జున్ జర్నీ వీడియోలో మైనస్‌లుగా నిలిచాయి. కేవలం అమర్‌ని చూపించిన విధంగానే అర్జున్ కూడా పాజిటివ్‌గా చూపించి ఉంటే ఇతనికి కూడా ఆడియన్స్ లో పాజిటివ్ ఇమేజ్ వచ్చేది. దీంతో కావాలనే అమర్ ని మాత్రమే పాజిటివ్గా చూపించి మిగతా వారిని నెగిటివ్‌గా మాత్రమే చూపిస్తున్నారు అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.