” కాంతారా చాప్టర్ 1 ” సినిమాకి ఆడిషన్స్ ఓపెన్… డీటెయిల్స్ ఇవే…!!

కన్నడ నటుడు రిష్బ్ శెట్టి మనందరికీ సుపరిచితమే. ఈయన ప్రధాన పాత్రలో నటించి.. దర్శకత్వం వహించిన మూవీ ” కాంతార “. ఇక ఈ సినిమాతో ఎంత పెద్ద హిట్ ని సాధించాడు మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ను మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.‌” కాంతార చాప్టర్ 1 ” అదే కాంతార ఎ లెజెండ్ పేరిట తెరకెక్కబోతోంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ సరివేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే మేకర్ సినిమాలో మరికొన్ని పాత్రల కోసం ఆడిషన్స్ ను ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది. మగవారు 30 నుంచి 60 సంవత్సరాల వరకు, ఆడవారు 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఈ ఆడిషన్స్ కి రావచ్చు.

అయితే kantara.film అనే సైట్ ను విజిట్ చేసి అందులో ప్రొఫైల్స్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి.. అజినీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై భారీ ఎత్తునే అంచనాలు నెలకున్నాయి.