” ఓజి ” సినిమాపై పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన మేకర్స్… ఈ వార్త చూసి బిక్క మొహం వేసిన ఫ్యాన్స్…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. తాజాగా ఈయన సినిమాలకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన బ్రేక్ ఇచ్చిన సినిమాలలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ట్రాక్ మూవీ ” ఓజి ” ఒకటి. ఈ సినిమా పై పవర్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ ని ఇస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

” ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఆకలిగానే ఉంటారు. వారికి ఇప్పుడు తాము చెప్పేది ఏమిటంటే.. ఇప్పుడు తాము ఎలాంటి షూటింగ్ చేయడం లేదు. అందుకే ఇప్పట్లో అప్డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం ఎవరు ఆశించవద్దు ” అంటూ క్లియర్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్లియర్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.