పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన తోటి కంటిస్టెంట్… నా పాట అతడి ఆట అంటూ డైలాగులు…!

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మనందరికీ సుపరిచితమే. ఇక ప్రశాంత్ ని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తోటి కంటెస్టెంట్స్ స్పందించారు. ఇక ఈ క్రమంలోనే సింగర్ భోలే షావలి తాజాగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. భోలే మాట్లాడుతూ…” టైటిల్ విన్నర్ గా ఎంతో సంతోషంగా బయటకు వచ్చాడు.

కానీ ఇప్పుడు ఇలా జరగడం చాలా బాధాకరం. అసలు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. ఒక సెలబ్రేషన్ జరిగినప్పుడు చాలామంది వస్తారు. అందులో కొందరు వేరే వ్యక్తులు ఉంటారు. అలాంటి వారి వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అంతమాత్రాన ఇంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రశాంత్ కు ఏం తెలియదు.

మీడియా వారితో ఆయన ఏమన్నా మిస్టేక్ గా ప్రవర్తించి ఉంటే నా తరపున సారీ చెబుతున్న. అతనికేం తెలియదు. అతను ఓ మట్టి బిడ్డ. హౌస్ లో ఆటాడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తగులుతాయి. రొమ్ము మీద దెబ్బ తగిలితే… అన్న ఇక్కడ నొప్పి వస్తుంది అక్కడ నొప్పి వస్తుంది అని ఎప్పుడూ అనలేదు. హౌస్ లో నా పాట అతడి వేట ” అంటూ భారీ భారీ డైలాగులు చెబుతూ కామెంట్స్ చేశాడు భోలే. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.