పవన్ కళ్యాణ్ ఆ నిర్మాతకు డబ్బులు వెనక్కి ఇవ్వడానికి కారణాలు ఏంటి…? అసలేం జరిగిందంటే…!!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో మరోపక్క పాలిటిక్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తనతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలలో ఒక నిర్మాత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం పవన్ కి తెలిసి తన రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేసారని సమాచారం. ఆ నిర్మాత సినిమా అనేక కారణాల వల్ల అంతకంతకు ఆలస్యం అవుతుంది. మూడేళ్ల క్రితం ఆ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ ఇప్పటికి కూడా అది తెరమీదకు రాలేదు.

ఇందువల్ల ఆ నిర్మాత నష్టాలలో ఉండడంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ ని ఇచ్చేసారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి మనసు తెలుసుకున్న ప్రేక్షకులు.. మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారిన ఈ వార్త ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుండగా ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే కంగారు అందరిలోనూ ఉంది.

ఇక 2024లో ఎలక్షన్స్ అనంతరం పవన్ సినిమాలు వరుసగా థియేటర్లలో అలరిస్తాయని అందరూ భావిస్తున్నారు. ఇక పవన్ నటిస్తున్న మూడు సినిమాల డైరెక్టర్లు కూడా ఫ్లాప్స్ తో ఉన్నారు. పవన్ పుణ్యమా అంటూ ఈ మూడు సినిమాలు హిట్ అయితే వారి కెరీర్ సెట్ అయిపోయినట్టే. మరి ఏమవుద్దో చూడాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ రెమ్యూనరేషన్ ఇచ్చేసిన నిర్మాత ఎవరో తెలియకపోయినప్పటికీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.