సుకుమార్ కార‌ణంగా ఆ యంగ్ హీరో కెరీర్ నాశనం అయ్యిందా.. ఏం జరిగిందంటే..?

స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు టాలీవుడ్ లో దాదాపు అందరూ హీరోలకు మంచి హిట్ సినిమాలు అందించిన సుకుమార్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ కు పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ అందించాడు సుకుమార్. ఈ సినిమా సక్సెస్ అవడంతో అల్లు అర్జున్ కు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా దక్కాయి. ఇక అలాంటి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో 100% లవ్ కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్గా తమన్నా నటించారు. అయితే ఈ సినిమా చేయడానికి ముందుగా నాగచైతన్య ప్లేస్ లో వరుణ్ సందేశ్‌ను అనుకున్నారట సుకుమార్.

వరుణ్ సందేశ్ కు కధ వినిపించగా వరుణ్ ఈ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. అయితే తర్వాత వరుణ్ సందేశ్ ఆ క‌ధ‌ చేజారిపోయింది. నాగచైతన్య కి వెళ్ళింది. అప్పట్లో వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం సినిమా హిట్ అవడంతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఆ టైమ్‌లో సుకుమార్ వరుణ్ సందేశ్‌కు కథ‌ వినిపించగా వరుణ్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే తర్వాత వరుణ్ నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో సుకుమార్ వరుణ్‌ని వదిలేసి నాగచైతన్యకు స్టోరీ వినిపించి అతని ఒప్పించాడు. నాగచైతన్య అప్ప‌ట్లో ఏ మాయ చేసావే సినిమాతో సక్సెస్ అందుకని దూసుకుపోతున్నాడు.

ఇక అలాంటి టైంలో 100% లవ్ సినిమాని నాగచైతన్యత చేస్తేనే కరెక్ట్ అని భావించిన సుకుమార్ వరుణ్ సందేశ్‌కు ఆ అవకాశం ఇవ్వకుండా.. నాగచైతన్య హీరోగా ఫిక్స్ చేశాడట. దీంతో వరుణ్ సందేశ్ కెరీర్‌లో ఓ హిట్ సినిమాను మిస్ అయ్యాడు. ఒకవేళ ఆ సినిమా వచ్చి ఉంటే ఆ మూవీ హిట్ కావడంతో తర్వాత మరికొన్ని అవకాశాలు వచ్చి మంచి హీరోగా ఎదిగేవాడు. అయితే అప్పటినుంచి వరుణ్ సందేశ్‌కు హీరోగా అవకాశాలు రాకపోవడంతో తన సినీ కెరీర్ నాశనం అయ్యింది. ఇలా సుకుమార్ కూడా వరుణ్ సందేశ్ కెరీర్ ఇబ్బందుల్లో పడడానికి కారణం అయ్యాడు.