” నన్ను ఆ ఒక్క రీజన్ తోనే హౌస్ నుంచి బయటకు తరిమేశారు “… సందీప్ మాస్టర్ సెన్సేషనల్ కామెంట్స్…!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకు మరింత రసవక్తంగా సాగుతుంది. ప్రస్తుతం తొమ్మిదో వారం కొనసాగుతుంది. కెప్టెన్సీ టాస్కులు కొనసాగుతున్నాయి. నిన్న ఆపోజిట్ టీం అయినా గౌతమ్.. ప్రశాంత్ ని డెడ్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ప్రశాంత్ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాకపోయినప్పటికీ.. మెంటల్ గా మాత్రం చాలా ఫిజికల్. టాస్కులలో ఈయన రేపే దుమ్ము అంతా ఇంతా కాదు.

అందుకే అతడికి భయపడి అతడిని డెడ్ చేశారు. ప్రశాంత్ ఈ వారం మొత్తం ఏ గేమ్ ఆడకూడదు.. ఉచిత సలహాలు సైతం ఇవ్వకూడదు. ఇక ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సందీప్.. దీనిపై స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు…” పాపం పల్లవి ప్రశాంత్.. గుడ్ ప్లేయర్.. వాడిని ఎందుకు డెడ్ చేశారు. ప్రశాంత్ ఉంటే ఆట ఆడలేరా? భయమా? స్ట్రాంగ్ ప్లేయర్స్ తోనే ఆడండి.

స్ట్రాంగ్ ప్లేయర్స్ ని బయటకు పంపి ఆడితే కిక్కేముంది. ఆఫ్ కోర్స్ నన్ను కూడా అందుకే బయటకు పంపించారు. నేను స్ట్రాంగ్ ప్లేయర్..” అంటూ చెప్పుకొచ్చాడు. సందీప్ వ్యాఖ్యలు విన్న ప్రేక్షకులు…” నువ్వు ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ ఓ మాకు తెలుసులే… అన్ని చీటింగ్ గేమ్స్ ఆడేవాడివి. అందుకే నిన్ను ఎలిమినేట్ చేశాం. ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలా..” అంటూ ఫైర్ అవుతున్నారు.