టాలీవుడ్ నిర్మాత SKN.. బాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమాతో అంటే..

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అనేది సాధారణ విషయం కాదు. ఎటువంటి వారికైనా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే దాని వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీ పడుతున్న కష్టానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో వెంటనే పాపులారిటీ వస్తుంది. అదేవిధంగా తాజాగా చిన్న సినిమాగా రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన బేబీ సినిమా కు కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్, ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్‌ల‌కు కూడా పాపులారిటీ పెరిగింది. ఇక ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌ మొదట పి ఆర్ వో గా పనిచేసి తర్వాత ప్రొడ్యూసర్‌గా మారాడు.

పూర్తి పేరు శ్రీనివాస్ కుమార్.. మెగా కుటుంబానికి చెందిన అనేకమంది అభిమానులలో ఎస్‌కేఎన్ ఒకడు. అల్లు శిరీష్ అతడిని గుర్తించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. సినిమాలపై అతడి డెడికేషన్.. ఆ తర్వాత పిఆర్వోగా మారి టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ జర్నీ మొదలుపెట్టాడు. మొదట్లో స్మాల్ టైం ఫిలిం జర్నలిస్టుగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసిన ఎస్‌కేఎన్ ఇప్పుడు ప్రముఖ నిర్మాతగా తన మొదటి సినిమా బేబీ తో బ్లాక్ బస్టర్ అందుకొని లాభాల బాట పట్టాడు. ఎస్‌కేఎన్‌ చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఇక గతంలో విజయ్ దేవరకొండ టాక్సీవాలాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్న ఎస్‌కేఎన్( స‌హ‌నిర్మాత‌గా) దేవరకొండ కుటుంబానికి లక్కీ ప్రొడ్యూసర్.

ఇక ప్రస్తుతం తెలుగు హీరోస్ అంత కూడా ఎస్‌కేఎన్‌ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలకు నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎస్‌కేఎన్ ప్రణాళిక ప్రకారం అన్ని పనులను నిర్వహిస్తాడని వారు నమ్ముతున్నారు. మారుతి, సాంకృత్యన్, సాయి రాజేష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం కలర్ ఫోటో సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్‌తో ఓ భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక తన సినిమాల్లో తెలుగు అమ్మాయిలను హీరోయిన్గా పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసిన ఎస్‌కేఎన్ బేబీ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసేందుకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని కోటబొమ్మాలి పిఎస్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు.