చాలామందికి కంటి కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. డార్క్ సర్కిల్స్ ఎక్కువ రోజుల పాటు ఉన్నట్లయితే అవి ముఖంపై అలానే ఉండిపోతాయి. వివిధ సమస్యలకు కారణం అవుతాయి. కంటి సమస్యలకు ముఖ్య కారణాలు ఇవే అవుతాయి. చాలా మందిలో డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు జెనిటిక్స్. కంటి కింద చర్మం పల్చగా ఉండటం కారణంగా డార్క్ సర్కిల్స్ వస్తాయి.
కంటి కింద చర్మం దగ్గర రక్త ప్రసరణ సరిగ్గా అందకపోయినా డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. ఇక కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడడానికి మరో ప్రధాన కారణం వయసు. వయసు పెరుగుతున్న కొద్దీ కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ఇక అలర్జీలు కారణంగా కంటి చుట్టూ ఉన్న రక్త కణాలలో సమస్యలు ఏర్పడి.. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాగే నిద్ర లేకపోయినా, నీళ్లు ఎక్కువ తాగకపోయినా కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అందువల్ల ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. అలాగే ఎల్లప్పుడూ వాటర్ ఎక్కువగా తాగాలి. చలికాలం అని మంచినీళ్లు మానేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.