కళ్ళ కింద నల్లటి మచ్చలు తొలగించడానికి బెస్ట్ టిప్స్ ఇవే…!!

చాలామందికి కళ్ళ కింద నల్లటి వలయాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో దొరికే వాటితో మన కంటి కింద నల్లటి వలయాలను చిటికలో తొలగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. టమోటో జ్యూస్:
టమోటో జ్యూస్ లో నిమ్మరసం కలిపి కళ్ళ కింద మసాజ్ చేస్తే కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలు తగ్గిపోతాయి.

2. బంగాళదుంప:
బంగాళదుంప సన్నగా తరిగి జ్యూస్ చేయాలి. కాటన్ బాల్ అందులో ముంచి కళ్ళ కింద ఉంచాలి.

3. గ్రీన్ టీ:
గ్రీన్ టీ బ్యాగులను నీటిలో ముంచి ఫ్రిజ్లో ఉంచాలి. అనంతరం తీసి కళ్ళ కింద పెడితే నల్లటి వలయాలు తగ్గుతాయి.

4. చల్లటి పాలు:
చల్లటి పాలలో దూదిని ముంచి కళ్ళ దగ్గర పెడితే నల్లటి మచ్చలు పోతాయి.

5. నారింజ జ్యూస్:
అలాగే నారింజ జ్యూస్ తోను కళ్ళ కింద మచ్చలను తొలగించవచ్చు. ఈ జ్యూస్ ని కొంచెం తీసుకుని కళ్ళ కింద పెడితే చాలు.

ఈ ఐదు టిప్స్ ఫాలో అయ్యి రెండు రోజుల్లో మీ కళ్ళ కింద ఉన్న నల్లటి మచ్చలని తొలగించుకోండి. అనంతరం మీ మొఖం సౌందర్యంగా కనిపిస్తుంది.