ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం విడాకులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం అమ్మాయిలు కొన్ని ప్రశ్నలు అబ్బాయిలని అడగకపోవడమే. సాధారణంగా కాబోయే జీవిత భాగస్వాముల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఎంత పర్సనల్ అయినా సరే మీ భాగస్వామి, మీరు ఒక్కటే అనుకుని వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే అంతేకాకుండా మహిళలు తప్పకుండా తమకి కాబోయే జీవిత భాగస్వామిని అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. మీ భవిష్యత్త్ లక్షణాలు ఏంటి:
అబ్బాయిల యొక్క లక్ష్యం గురించి అడిగేందుకు ప్రతి ఒక్క ఆడపిల్ల వెనుక పడుతుంది. అలా అడిగితే ఏమనుకుంటారో అనే సందేహంతో ఉండిపోతుంది. కానీ ఇది చాలా తప్పు. మీ జీవిత భాగస్వామి లక్ష్యం ఏంటో మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
2. మీ నుంచి వారు ఏం కోరుకుంటున్నారు?
మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఏం కోరుకుంటున్నారో మీరు ముందుగా తెలుసుకోవాలి. దీంతో ఒకరి మనసు ఇంకొకరు తెలుసుకొని కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడతారు.
3. రిలేషన్ షిప్ గురించి వారి అభిప్రాయం ఏమిటి?
ప్రేమ, పెళ్లి లాంటి రిలేషన్ షిప్ గురించి మీకు కాబోయే జీవిత భాగస్వామికి ఏ విధంగా అవగాహన ఉంది? మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటాడు? అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఈ మూడు ప్రశ్నలు మీకు కాబోయే జీవిత భాగస్వామిని.. తప్పనిసరిగా అడగాలి. ఇవి అడగడం వల్ల వారి ఏక అభిప్రాయాలు తెలిసి మీరు సుఖ సంతోషాలతో లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండగలరు. ఇవేవీ అడగకుండా మీ జీవిత భాగస్వామి చేసుకుంటే.. మీ బంధం ఎంతో కాలం నిలవదు. అందువలన పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి.. మీకు క్లారిటీ వచ్చేలా మీకున్న ప్రశ్నలన్ను అడగండి.