ప్రముఖ ప్రొడ్యూసర్ రామానాయుడు చివరి కోరిక ఏంటో తెలుసా.. ఇక ఎప్పటికీ నెరవేరదుగా..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు దగ్గుబాటి రామానాయుడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 110 సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి రికార్డును సృష్టించిన రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు సంపాదించుకున్నాడు. మూవీ మేఘాలు అంటూ సినీ వర్గాలు అయ‌న్ని పిలుస్తుంటారు. నమ్మినబంటు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. కాగా మహాబలిపురం ‘ అనురాగం ‘ సినిమా నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నామని కబురు పెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి జీ.రామిరెడ్డి దర్శకత్వంలో అనురాగం అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో పెద్ద కుమారుడు సురేష్ పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభింmeci.

1964లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ రాముడు – భీముడు ‘ సినిమాతో ప్రొడ్యూసర్ గా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇలా అప్పటి స్టార్ హీరోస్ ఎంతోమంది సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన రామానాయుడు కొత్తవారికి కూడా అవకాశాలు ఇచ్చేవాడు. అలా 21 మంది కొత్త దర్శకులను, ఆరుగురు కొత్త హీరోలను టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. అయితే సినీ కెరీర్‌లోను వ్యక్తిగతంగా మంచి సక్సెస్ అందుకున్న రామానాయుడు చివరి కోరిక మాత్రం తీరలేదట. ఇంతకీ ఆ కోరిక ఏంటో చూద్దాం.

గతంలో రామానాయుడు ఇంటర్వ్యూలో పాల్గొనగా మీకు అన్ని వచ్చాయి.. అన్ని సమకూరాయి. ఇక మనకి ఏమి లోటు లేదు అనుకునే సమయంలో ఏదైనా కోరిక ఉంది అంటే అది ఏంటో చెప్పమని ఇంటర్వ్య‌వర్ అడగగా రామానాయుడు స్పందిస్తూ నేను, నా కొడుకు వెంక‌టేష్‌, మనవడు రానా, నాగచైతన్యలతో కలిసి ఒక మల్టీ స్టార‌ర్ సినిమా తీయాలని ఉంది అదొక్కటే నా కోరిక అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అన్నీ ఉన్నా ఆ కోరిక మిగిలిపోయింది అంటూ చెప్పిన రామానాయుడు అతని కోరిక తీరక ముందే మరణించాడు. ఇక ఎప్పటికీ ఆ కోరిక నెరవేరదు కూడా. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో మనం సినిమాను ఈ ఫ్యామిలీతో తీసి ఉంటే బాగుండేది ఆయన కోరిక కూడా నెరవేరేది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.