షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన శ్రీ లీల.. ఇంట్లో ఎలాంటి పనులు చేయించుకుంటుందో చూడండి..

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్క‌డ చూసినా శ్రీ లీల పేరే వినిపిస్తుంది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీ‌లీల‌ ధమాకా సక్సెస్ అందడంతో వరుస సినిమా అవకాశాలు అందుకుంది. దాదాపు డజన్ సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ నెలకొకటి చొప్పున థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇక తాజాగా శ్రీ లీల.. బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాలో విజ్జి పాపగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్యకు ఎంత క్రేజ్ దక్కిందో శ్రీ‌లీల‌కు కూడా అదే రేంజ్ లో గుర్తింపు వచ్చింది.

అదేవిధంగా టాలీవుడ్ అగ్ర హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా శ్రీ లీల నటిస్తుంది. ఇక తాజాగా శ్రీ లీల మూవీ షూట్లకు గ్యాప్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తన హోమ్ టౌన్ లో రిలాక్స్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోతో శ్రీ‌లీలకు ఇంట్లో వారు ఎలాంటి సేవలు చేస్తున్నారు చూపించింది. తల్లి టిఫిన్‌ తినిపిస్తుంటే.. వేరే మహిళ శ్రీ లీల జుట్టుకు సాంబ్రాణి వేస్తూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం శ్రీ లీలా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోకు అనుభవించు రాజా.. సాంగ్ యాడ్‌చేసి శ్రీ లీల తన ఇన్స్టా స్టోరీగా షేర్ చేసుకుంది. తన అభిమాన హీరోయిన్ కు ఇంట్లో మహారాణిలా సేవలు చేస్తున్న ఈ వీడియో చూసిన‌ ఫాన్స్ ఫుల ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన శ్రీ లీలా తన స్టడీస్, పరీక్షల కోసం ఈ సమయాన్ని వినియోగిస్తుందట. ఆ తర్వాత మళ్లీ మిగిలిన ప్రాజెక్ట్ పై పోకస్ పెడుతుంద‌ని సమాచారం. ఇప్పటికే ఆదికేశవ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 24న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే నెక్స్ట్ మంత్ నితిన్ సరసన నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.