వరల్డ్ కప్ లో షాకింగ్ రిజ‌ల్ట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్స్.. వీడియో వైరల్..!!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ 2023 నిన్న (నవంబర్ 19 ) న జరగనే జరిగింది. కానీ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది ఇండియా . హైదరాబాద్ వేదికగా ఇండియా , ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరు వికెట్ల తేడాతో భారత్ జట్టు ఓడిపోయింది. దీంతో 12 ఏళ్ల వరల్డ్ కప్ ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగిన టీం ఇండియా మరోసారి తీవ్ర ఓట‌మి ఎదుర్కొంది.

ఈ ఓటమి 140 కోట్ల భారతీయులకు గుండె కోతను మిగిల్చింది. మరోవైపు ఈ ఫైనల్ పోరులో అద్భుత ప్రదర్శన ఇచ్చి మరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు.

ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలవడంతో.. ఇండియన్ క్రికెటర్స్ కంటతడి పెట్టుకున్నారు.
అందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ చాలా బాధపడినట్లు ఓ వీడియోలో తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ టోర్నీ మొత్తం కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 765 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు.