చెర్రీ, తారక్ తో క్రిస్మస్ టూర్ ప్లాన్ చేసిన మహేష్.. న్యూయ‌ర్ కూడా అక్క‌డేన‌ట‌!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి ఐదు, ఆరుసార్లు ఫ్యామిలీతో కలిసి టూర్, వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. షూటింగ్‌కి గ్యాప్ వచ్చినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఫ్యామిలీకి వాల్యుబుల్ టైం ఇవ్వడంలో నాకు చాలా సంతోషం ఉంటుందంటూ చెప్పుకోస్తాడు. మహేష్ ఇక తను నటించే సినిమా యూనిట్లకు ముందుగానే ఈ విషయాన్ని చెప్తాడు. ఈ రకంగా మహేష్ బాబు మూవీ తీస్తే మేకర్స్ కు అంచనా ఉంటుంది ఈసారి కూడా మహేష్ క్రిస్మస్ వేడుకను పురస్కరించుకుంటూ విదేశాలకు టూర్ ప్లాన్ చేశాడు.

ఇక పిల్లలకు ఎలాగూ క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. ఆ నేపథ్యంలో ఫ్యామిలీ అంతా క్రిస్మస్ టూర్ వేసేస్తారు. ఇలోపు తన గుంటూరు కారం షూటింగ్ కూడా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట మహేష్. క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది. కాకపోతే ఈసారి మహేష్ ఆర్ఆర్ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లను కూడా తన క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కలుపుకోబోతున్నాడట. ఈసారి మహేష్ ఫ్యామిలీతో పాటు చర్రీ, తార‌క్‌ ఫ్యామిలీ కూడా మహేష్ ఫ్యామిలీ క్రిస్మస్ టూర్ లో జాయిన్ అవుతాయంటూ తెలుస్తుంది.

ఇక చెర్రీ, తారక్, మహేష్ ముగ్గురు మొదటి నుంచి మంచి స్నేహితులు. అలాగే వీరి భార్యలు నమ్రత, ఉపాసన, లక్ష్మి ప్రణతిలు కూడా ఎంతో క్లోజ్‌గా ఉంటూ ప్రతి ఈవెంట్లో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక వీరు ముగ్గురు ఫ్యామిలీతో కలిసి టూర్ చేస్తారంటూ వస్తున్న న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో నిజంగానే ఈ మూడు ఫ్యామిలీస్‌ని ఓకచోట చూస్తే కన్నుల పండుగ ఉంటుంది అంటూ హీరోల ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.