ప్రభాస్ ” స్పిరిట్ ” రిలీజ్ టైం లాక్… ఎప్పుడంటే…!!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటిస్తున్న మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఫ్యాన్స్ కి కూడా కావాల్సినంత హైట్ ని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో నటించనున్న ” స్పిరిట్ ” పై కూడా సాలిడ్ హైప్ నెలకొనగా .. ఈ సినిమాపై పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక దర్శకుడు సందీప్ ఈ సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటుగా ఇప్పుడు అదనంగా మరింత సాలిడ్ ఇన్ఫో బయటకి వచ్చింది. దీంతో ఈ సినిమాని తాము 2025 క్రిస్మస్ రేస్ లో లేదా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు కన్ఫామ్ చేశారు. ఇక ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం అప్పటివరకు ఆగక తప్పదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.