” ప్రభాస్ అయిన ఓకే… 70 ఏళ్ల ముసలోడైన ఓకే “… బలగం నటి సెన్సేషనల్ కామెంట్స్…!!

జబర్దస్త్ కమెడియిన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి గాను పలు అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అందులో కొమురయ్య కూతురుగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ కు తల్లిగా రూప లక్ష్మి చక్కటి నటనతో ఆకట్టుకుంది.

ముఖ్యంగా తండ్రి చనిపోయినప్పుడు ఆమె పండించిన ఎమోషన్ అంతా ఇంతా కాదు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్ పై ఈమె కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది.” చిన్న వయసులోనే తల్లి పాత్రను పోషించారు కదా. రేపు ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు తల్లిగా చేయమని అడిగితే ఏం చేస్తారు? ” అని ప్రశ్నించగా…” మహిళ జీవితంలో సంతృప్తి గా ఉండేది ఏదంటే తల్లి స్థానం.

కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నటించడానికి నేను ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటా. ప్రభాస్ అనే కాదు 70 ఏళ్ల వ్యక్తికి కూడా అమ్మగా నటించమంటే నేను నటిస్తా. నాకు ఎటువంటి మొహమాటం లేదు. నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తాను ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.