క్యాన్సర్ బాధిత పిల్లలతో ఆడి, పాడి సందడి అడవి శేష్.. హార్ట్ టచింగ్ వీడియో..

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ దక్కించుకున్న అడవి శేష్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల జూడ్ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని ఓ ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్న అడవి శేషు అక్కడ చిన్నారులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. వారికి కొన్ని బహుమతులు ఇచ్చి వారిని సంతోష పెట్టాడు.

అనంతరం దానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. పిల్లలతో గడపడం నా జీవితంలో చాలా గొప్ప టైం అని ఈ పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు. వారు క్యాన్సర్ తో పోరాటం చేస్తు నాకు చాలా ఆశలు కల్పించారు. ఈ అవకాశం కల్పించిన కమలేష్, లక్ష్మికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ ట్విట్ చేశాడు. ప్రస్తుతం అడవి శేష్ ఈ వీడియోస్, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అడవి శేషు చేసిన గొప్ప పనిని తన అభిమానులంతా మెచ్చుకుంటున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఇక జూడ్‌ సంస్థ ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా వెనుకబడిన కుటుంబాలకు వివిధ రకాలుగా సహాయం అందిస్తుంది. క్యాన్సర్ పై పోరాటంలో డ్యాన్స్ థెరఫీని అందిస్తుంది. ఇందులో భాగంగా క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లలకు రోజు అరగంట సేపు డ్యాన్స్ క్లాసులు ఏర్పాటు చేస్తుంది. ఇక ప్రస్తుతం అడవి శేష్‌ జి 2 సినిమాలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.