ముత్యాలు లాంటి ఎన్టీఆర్ రాత…ఎప్పుడైనా చూశారా.. దీన్ని చూసి ప్రింట్ అనుకుంటారేమో… అస్సలు కాదండోయ్..‌!!

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటన తిరుగు లేనిది. ఆయన మాట తిరుగు రానిది. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవుడు ఎలా ఉంటాడు అని ఎవరినైనా అడిగితే.. ముందుగా ఎన్టీఆర్ ఫోటోలు చూపిస్తారు. అంతటి గొప్పతనం ఒక్క ఎన్టీఆర్కి మాత్రమే సొంతం. ఎన్టీఆర్కు తెలుగు భాష పై మంచి పట్టు ఉన్న సంగతి మనకి తెలిసిందే. ఆయన చదువులోనూ ముందే.. ఇతర యాక్టివిటీస్ లోను ముందే.

అందుకే ఈయన..1100 మంది రాసిన మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలో ఏడవ ర్యాంక్ సాధించారు. మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగాన్ని సైతం సంపాదించారు. అంతేకాకుండా చిత్రలేఖనంలో కూడా రాష్ట్రస్థాయి ప్రైజులు పొందారు‌. తాజాగా ఈయ‌న‌ రాసిన ఓ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసి ప్రింట్ అనుకుంటారేమో.. అస్సలు కాదండోయ్. ఎన్టీఆర్ గారు చేతులారా రాసిన ఆణిముత్యాలు ఇవి.

ఆ రాతలు చూస్తేనే ఆయనపై గౌరవం పుట్టుకొస్తుంది. అంత గొప్పగా ఉంది. ముత్యాల లాంటి అక్షరాలు, ఎక్కడ తప్పులు లేని వ్యాఖ్యలు.. ఓ గొప్ప రచయిత రాసినట్లుగా వ్యాఖ్యానాలు.. అందమైన భావనతో కూడిన లేక ఇది. ఈ మూడు పేజీల లేక.. షూటింగ్ మధ్యలో రాసే వారట ఎన్టీఆర్. ఈ లేఖను చూసిన అభిమానులు..” ఆయన ముందు ఏ చదువు అయినా తక్కువే.. అంత గొప్ప నటుడు, గాయకుడు, రచయిత. ఇప్పటికీ ఆయన పేరు చెబితేనే ఆత్మ అభిమానం ముంచుకొస్తుంది ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.