లావణ్య, వరుణ్ తేజ్ నవంబర్ 1న 3 ముళ్ళు బంధంతో ఒకటైన సంగతి మనకి తెలిసిందే. అనంతరం హైదరాబాదులో రిసెప్షన్ కూడా జరుపుకున్నారు. ప్రస్తుతం లావణ్య మేకప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెడ్ కలర్ శారీలో వెలిగిపోయిన లావణ్య.. శుభకార్యం లో శుభ సూచకంగా రెడ్ కలర్ లిప్ స్టిక్ ను వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపాడు మేకప్ పార్టిస్ట్.
అయితే బ్రైట్ రెడ్ .. అది కూడా డేలో మరింత బ్రైట్ ఉంటుందని తను వద్దన్నట్లు చెప్పాడు. శారీ మరింత స్పెషల్ గా కనిపించేందుకు స్మోకీ ఐస్, స్కూడ్ లిప్స్ అయితే బాగుంటాయని మేకప్ ఆర్టిస్ట్ చెప్పడంతో… లావణ్య సైతం ఓకే అందట. మేకప్ ఆర్టిస్ట్ పేరు సందీప్. ఈయన పలు సెలబ్రిటీల పెళ్లిళ్లకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేసేవాడు.
ఇంతకుముందు లావణ్య ఎంగేజ్మెంట్ మేకప్ కూడా ఇతనే వేశాడట. ఈయన మేకప్ తో లావణ్య కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం వల్ల ఈమె పెళ్లికి కూడా ఈ మేకప్ ఆర్టిస్ట్ నే పెట్టుకున్నారట. ఏది ఏమైనప్పటికీలావణ్య.. ముప్పు తిప్పలు పెట్టి అనంతరం ఓకే చెప్పడంతో… లావణ్య మేకప్ విషయంలో ఇంత స్ట్రిట్ గా ఉంటుందా.. అమ్మ బాబోయ్.. పైకి మాత్రం కూల్ గా ఉన్నట్టు కనిపిస్తుందే.. అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. మేకప్ విషయంలోనే ఇంత స్ట్రిట్ గా ఉన్న లావణ్య రేపు.. మెగా ఫ్యామిలీ సాంప్రదాయాల విషయంలో ఎలా సర్దుకుపోతుందో చూద్దాం.