ఉదయాన్నే లేచి ఈ రసం తాగితే… ఇన్ని లాభాలా… ఇన్నాళ్లు తెలియక దీనిని మిస్ చేసుకున్నామే….!!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న పని చేసిన సరే డీలా పడిపోతున్నారు. మన పూర్వీకులు ఎంత ఒత్తిడైన పనిచేసిన సరే దృఢంగా ఉండేవారు. దానికి కారణం వాళ్లు తిన్న ఆహారం. ప్రస్తుత కాలంలో పిజ్జాలు, బర్గర్లు తింటున్నారు. కానీ గతంలో రాగి జావా, జొన్నలు లాంటివి తీసుకునేవారు. రాగి జావా ఎక్కువగా తీసుకునేవారు. ప్రస్తుత కాలంలో దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

దీనిని ఎందుకు తాగాలి? దీంట్లో ఏం ప్రోటీన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. రాగిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే రాగి జావా తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాగి లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. దీనిని ఉదయాన్నే తాగడం వల్ల రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా గుండెని కూడా బలంగా ఉంచుతుంది. మన బాడీకి వ్యాధులు తాకకుండా కాపాడుతుంది. అధిక బరువు సైతం తగ్గుతారు. షుగర్, క్యాన్సర్ లాంటి సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది. అందువలన రోజు ఉదయాన్నే రాగి జావ తాగడం చాలా ఉత్తమం. ఇలా ఉదయాన్నే రాగిజావ ఒక వారం పాటు తాగి చూడండి. మీకే ఫలితం కనిపిస్తుంది.