చంద్రమోహన్ బాలసుబ్రమణ్యం మధ్య ఉన్న లింక్ అదేనా.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా స్టార్ హీరోయిన్లకు తండ్రిగా నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈయన.. అనారోగ్య సమస్యతో ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఇక కే. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య ఉన్న బంధం గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. గాన గాంధర్వుడు సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి.. చంద్రమోహన్ కి మధ్య కూడా బంధం ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.

సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం తో చంద్రమోహన్ కి ఉన్న బంధం ఏమిటంటే… చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య వివాహం చేసుకున్నారు. అలా వీరిద్దరికీ అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా ఏర్పడిన వీరిద్దరి బంధం ఉన్నంతకాలం ఎంతో అన్యోన్యంగా కొనసాగింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.