సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఒక్క సినిమాలలోనే కాదట ఇతర అంశాలలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవాడట కృష్ణ. తన కూతురు పెళ్లి అప్పుడు జయలలిత కి ఫోన్ చేసి.. కూతురు పెళ్లికి రావద్దని చెప్పారట.
కృష్ణ కూతురి పెళ్లికి మూడు రోజులు ముందుగా వచ్చిన జయలలిత ని సెక్యూరిటీ ఆఫీసర్ ఒక రిక్వెస్ట్ చేశాడట. మీరు ఈ పెళ్లికి వస్తే సీఎం, ప్రముఖ రాజకీయ వ్యక్తులు రారని రిక్వెస్ట్ చేశారట. దీనికి జయలలిత పెళ్లికి వచ్చే వాళ్ల కోసం మూడు క్యూబ్ లైన్స్ కట్టించండి అని కోరిందట. దానికి కృష్ణ ఒప్పుకోలేదట. అందుకు కారణం అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులని అక్కడికి పిలవడం మే కారణమట.
అందుకని వాళ్ళని పక్కన పెట్టేస్తే మంచిది కాదని జయలలిత కి ఫోన్ చేసి.. నువ్వు నా కూతురు పెళ్లికి రావద్దు. ఈ దంపతులకి నీ ఆశీర్వాదం ఉంటే చాలు అని చెప్పారట. దీంతో జయలలిత నవ్వి పెళ్లి దంపుతులకు ఒక బొకే ని పంపించారట. కృష్ణ ..కూతురి పద్మావతి పెళ్లికి ఏపీలో రాజకీయ ప్రముఖులతో పాటు గా అప్పటి తమిళనాడు సీఎం జయలలితను కూడా ఆహ్వానించారు. కానీ ఇలా జరిగింది.