స్టేజ్ పైనే గుండు కొట్టించుకున్న బుల్లెట్ భాస్కర్.. కుష్బూ ఫైర్.. ఇలా చేస్తే జడ్జిమెంట్ మానేస్తామంటూ..

బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షో గా జబర్దస్త్ ఖ్‌ఱ‌స్త్రజ్ సంపాదించుకుంది. ఎప్పుడు అదిరిపోయే టిఆర్పి తో కొనసాగుతున్న జబర్దస్త్ షోలో జనాలు అటెన్షన్ డ్రాప్ చేసేందుకు.. తిట్టుకోవడం, లవ్ ట్రాక్లు నడపడాలు, ఒకరిపై ఒకరు అరుచుకుంటూ రచ్చ చేయడం.. అశ‌ఙ‌ ప్రోమోళ‌క్ష‌ కట్ చేసి వదులుతూ ఉండడం సర్వసాధారణం అయిపోయింది. అయితే తాజాగా ఇషోలో బుల్లెట్ భాస్కర్ గుండు కొట్టించుకుంటూ కనిపించాడు. ప్రస్తుతం ఈ న్యూస్‌ హాట్ టాపిక్ గా మారింది. ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లో భాగంగా బుల్లెట్ భాస్కర్ తన టీం తో కలిసి నిజం సినిమా స్కిట్ని ప్రదర్శించాడు.

గోపీచంద్ గా బుల్లెట్ భాస్కర్, మహేష్ గా నరేష్, మదర్ రోల్ లో ఫైమా నటించారు. గోపీచంద్ పాత్రలో బుల్లెట్ భాస్కర్ పెద్దమ్మ తల్లికి అమ్మోరు తల్లిని బలి ఇవండ్రా అంటూ ఉండగా జడ్జ్ కృష్ణ భగవాన్ అభ్యంతరం తెలిపారు. సినిమాలో గోపీచంద్ పెద్దమ్మ తల్లి వ‌ద్ద‌కు వెళ్ళినప్పుడు ఆయనకు గుండు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ నుంచి పెట్టుకోవలి సర్.. మధ్యలో అంటే కష్టమవుతుంది అంటే వివరించడం. ఈ నేపథ్యంలో కుష్బూ రియాక్ట్ అవుతు స్కుఫ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ ఫీల్ అవ్వడానికి ఏం లేదు అంటూ ఫైర్ అయింది. భాస్కర్ తను స్కిట్ కోసం ప్రాణమిస్తాను అంటూ జబర్దస్త్ లోని గుండు గీయించుకుని షాక్ ఇచ్చాడు.

షో స్టేజి మీద స్కిట్లోనే ఆయన తన గుండు గీయించుకుని నిజం లో గోపీచంద్ స్కూప్ చేయడానికి రెడీ అయ్యాడు. దీంతో కృష్ణ భగవాన్, కుష్బూ, యాంకర్ రష్మీ కమీడియన్స్‌ అంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు ఓకేనా సార్ అంటూ భాస్కర్ కృష్ణ భగవాన్‌ను అడిగాడు. ఆ ఎఫెక్ట్ కనిపించాలి అన్నాం కానీ.. నిజంగా గుండు గీయించుకుంటే ఎలా అంటూ కృష్ణ భగవాన్ రియాక్ట్ అయ్యాడు. దీంతో భాస్కర్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ముందు చెప్పాలి అంతా అయిపోయాక బొచ్చు వెనక్కి వస్తుందా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు భాస్కర్. దీంతో కుష్బూ భాస్కర్ పై ఫైర్ అయింది. మాకు ఓ రెస్పాన్స్‌బిల్టీ ఇచ్చారు. అందుకే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టారు.

తప్పు అనిపిస్తే.. మేము కామెంట్ కూడా చేసే ఫ్రీడం లేదంటే.. ఎలా అంటూ మాట్లాడింది. భాస్కర్ ఏదో ఆడబోతుండగా నేను మీతో మాట్లాడటం లేదు అంటూ సీరియస్ అయినా కుష్బూ ఒక జడ్జ్ గా మాకు ప్రశ్న అడిగే రైట్ లేదంటే ఇక్కడ మేము ఎందుకు ఉండాలి అంటూ లేచి వెళ్ళిపోగా.. భాస్కర్ థాంక్యూ మేడం అంటూ స్టేజి నుంచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ హైప్‌ కోసం ఇలా చాలాసార్లు చేశారు జబర్దస్త్ టీం. ఇది కూడా అందులో భాగమే అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు.