లేడీ బాల‌య్య‌లా ఇర‌గ‌దీసిన‌ వేద.. ఇక నుంచి ” సత్యభామ గా ” ..!!

” ఎన్నెన్నో జన్మల బంధం ” సీరియల్ వస్తే చాలు బుల్లితెర ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతారు. ముఖ్యంగా ఈ సీరియల్లో యష్, వేద జోడి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే.. ఎవరు ఊహించ లేని విధంగా ఈ సీరియల్ కి శుభం కార్డ్ వేసారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా హాట్ అయ్యారు. అయితే తాజాగా వేద ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది స్టార్ మా.

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ (వేద) తో సరికొత్త ధారావాహిక ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. ఈ సీరియల్ పేరు సత్యభామ. దీనిలో ఒక కాలేజీ అమ్మాయిగా వేద కనిపిస్తుంది. కానీ పేరుకు తగ్గట్లు ఏదైనా తేడా వస్తే మాత్రం సత్యభామలా ఫైర్ అయిపోతుంది.

ఇక ఈ సీరియల్ ప్రోమోలో తన ఫ్రెండ్ చున్నీని కాలేజీలో ఒక కుర్రాడు లాగుతాడు. దీంతో వాడి చంప పగలగొడుతుంది ఇక తర్వాత మరో పవర్ఫుల్ డైలాగ్ కూడా చెబుతుంది. ఆడది కొట్టే దెబ్బను తట్టుకోవడం చున్నీ లాగినంత ఈజీ కాదు అంటూ లేడీ బాలయ్యలా ఇరగదీసింది. ప్రేమని తప్ప హింసని భరించలేని ఈ సత్య జీవితం ఎలా ఉండబోతుంది అనేదే సీరియల్ కథ.