బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చేసాడు. కొందరిపై కోప్పడ్డాడు. మరికొందరిని మాత్రం బుజ్జగించాడు. ఇంకొందరిని మెచ్చుకున్నాడు. మరీ తీసి పడేయలేం కానీ.. ఓ మాదిరిగా ఇంట్రెస్టింగ్ గానే శనివారం ఎపిసోడ్ సాగింది. సీరియల్ బ్యాచ్ పై సీరియస్ అయినా నాగార్జున.. శివాజీ దగ్గరికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు. శివాజీ మొన్న అన్న మాటలు వీడియో ప్లే చేసి నాగ్ అడిగాడు.
దానికి రిప్లై ఇచ్చిన శివాజీ ఇలా అన్నాడు.. ” ఎవరో ఒకరిని కొట్టేసి వెళ్ళిపోతా? అన్నావు కదా శివాజీ అసలేమైంది? అని నాగ్ అడగగా..” నేను అవన్నీ చెప్పుకోలేను.. హౌస్ లో చాలా విషయాలు బాగోట్లేదు. నేను నీతిగానే ఉంటున్నాను. మనుషుల పేర్లు చెప్పలేను కానీ చాలామంది ప్రవర్తన ఇబ్బందిగా ఉంటుంది. నన్ను పంపించేసిన పర్లేదు? నన్ను తిట్టినా పర్లేదు? ” అని శివాజీ నాగార్జునతో అన్నాడు. మరి ప్రశాంత్, యావర్ కి వాళ్ళ బిహేవియర్ గురించి చెప్పావా? శివాజీని నాగ్ అడగగా.. వీళ్ళతో పాటు సందీప్ కి కూడా చెప్పానని శివాజీ అన్నాడు.
దీని తర్వాత నాగ్ మాట్లాడుతూ…” శివాజీ సేఫ్ ఆడొద్దు. నీకు ఏమనిపిస్తే అది చెప్పు ” అని అన్నాడు. దీనికి స్పందించిన శివాజీ..” ఇదే చివరి అవకాశం.. ఇక చెయ్యి జారిపోతే చెప్పేస్తా బాబు గారు ” అంటూ నాగ్ కి చెప్పాడు. దీన్ని బట్టి చూసుకుంటే శోభ, ప్రియాంక తప్పు చేస్తే సీరియస్ అవుతున్న నాగార్జున.. శివాజీ తప్పు చేస్తే మాత్రం బుజ్జగిస్తున్నాడు. ఇది చూసిన ప్రేక్షకులు శివాజీ దగ్గర గట్టిగానే లాగినట్టున్నాడుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.