గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 2024 జనవరిలో మొదలుకానుంది. ఇక చెర్రీ గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ దీవాలి కనుకగా రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో నిజాలు తెలియాలి. ఇక ప్రస్తుతం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకడు. అతడిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే మెమొరబుల్ మూవీ అని చెప్పవచ్చు.
తాజాగా జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్ జరగగా ఈ వేడుకలకు ఆర్‌ఆర్ఆర్ టీం తరపున కీరవాణి హాజరు కావడం జరిగింది. ఈ ఈవెంట్ కి మనదేశంలోని జర్మనీ ఎంబసీకి చెందిన సిబ్బంది కూడా హాజరయ్యారు. రామ్ చరణ్ వీడియో కాల్ లో సిబ్బందిని పలకరించడంతోపాటు ఈ వేడుకలకు తాను హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఈవెంట్ చూసి తనకు సంతోషం కలిగిందని రామ్ చరణ్ వీడియో కాల్ ద్వారా తెలియజేశాడు.
అవకాశం ఉన్నప్పుడు ఎంబసీ సిబ్బందిని నేను కలుస్తానంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక కీరవాణి ఈ ఈవెంట్లో జర్మన్ లాంగ్వేజ్ లో పాట పాడి మెప్పించాడు. కీరవాణి మాట్లాడుతూ పాటకు ఆస్కార్ వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు. నాటు నాటు పాటకు మంచి ప్రేక్షకాధరణ దక్కినందుకు చాలా సంతోషం అంటూ చెప్పుకొచ్చిన కీరవాణి ఈ పాటకు వచ్చిన ఆస్కార్ భారతీయ సినిమాకు ఓ ప్రోత్సాహం అని ఇది గొప్ప శకునానికి నాంది అంటూ చెప్పుకొచ్చాడు.