మళ్లీ పెళ్లికి సిద్ధమైన శ్రీజ.. వరుడెవరంటే..?

మెగా డాటర్ కొణిదెల శ్రీజ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. సినిమాలలో నటించక పోయినా.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా తన వ్యక్తిగత జీవిత విషయంలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చిరంజీవి చిన్న కూతురుగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈమె హీరోయిన్ అవుదామని ఎంతో ప్రయత్నం చేసిందట. కానీ ఆ విషయంలో సురేఖ ఫుల్ సపోర్ట్ ఇచ్చినా.. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో చిరంజీవికి బాగా తెలుసు కాబట్టి హీరోయిన్ అవ్వాలనే ఆశలు ఏమైనా ఉంటే మర్చిపోండి అంటూ కూతుర్లకు వార్నింగ్ ఇచ్చారట చిరంజీవి.

 

అందుకే శ్రీజ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మొదట్లో ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఒక బిడ్డ పుట్టాక.. అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయి మళ్లీ చిరంజీవి దగ్గరికి వచ్చిన ఈమె ఆ తర్వాత బంధువుల అబ్బాయిని రెండో వివాహం చేసుకుంది. అతడితో కూడా ఒక బిడ్డ జన్మించిన తర్వాత విడాకులు తీసుకొని దూరమయింది. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు శ్రీజ కు సంబంధించిన మరొక వార్త నెట్టింట చెక్కర్లు కొడుతోంది.

తాజాగా ఒక వ్యక్తితో ఉన్న ఫోటోలు శ్రీజ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీనితో ఈమె మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా జిమ్ లో శ్రీజ వర్కౌట్ చేస్తున్న వీడియోలు నెట్టింట షేర్ చేయగా.. తన జిమ్ ట్రైనర్ శ్రీజ కి ఎన్నో రకాల కసరత్తులు నేర్పిస్తున్నారు. చివరిగా ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోతో ఆ వీడియో కాస్త ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవ్వగా ఇది చూసిన చాలామంది నెటిజెన్లు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Myo Movement (@myomovementindia)