హౌస్ మేట్స్ పై శివాజీ ఫైర్.. ఈవారం తప్పకుండా హౌస్ లో ఎవరినో ఒకడ్ని కొట్టి వెళ్ళిపోతా అంటూ..

సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలో అడుగు పెట్టారు హౌస్ మేట్స్. ఇక లాస్ట్ వారం పూజ ఎలిమినేట్ కాగా… ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ గట్టిగానే జరిగింది. ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 8 మంది లిస్టులో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే.. శోభ, భోలె, అశ్విని, శివాజీ, ప్రియాంక, అమర్, సందీప్, గౌతమ్.

ఇక ఎప్పుడు నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఏం మాట్లాడని శివాజీ.. ప్రక్రియ ముగిసిన తర్వాత యావర్, రతికల దగ్గర హౌస్ మేట్స్ పై సీరియస్ అయ్యాడు. ” దొంగలు.. దొంగ దొంగ అని పరిగెట్టిస్తున్నారే.. చూస్తారు. ఇప్పుడన్నా జనాలు, మనుషులు, ప్రజలు అనే వాళ్లు ఉంటే చూస్తా ఈ వారం. ఈ వారాన్ని బట్టి ఈ హౌస్ లో ఉంటా. లేదంటే వాలంటిర్ గా ఎవడినో ఒకడిని కొట్టి వెళ్ళిపోతా ” అంటూ ఫైర్ అయ్యాడు.

దీనిని చూసిన ప్రేక్షకులు ఎవరికీ లేని నొప్పి ఈయనకేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ప్రశాంత్ ఏం చేసినా బానే ఉంటుంది కానీ మిగతా కంటిస్టెంట్లు ఏం చేయకపోయినా వాళ్ల మీద విరుచుకు పడుతుంటారు. ముందు మీ బిహేవియర్ మార్చుకోవాలి అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.