“నన్ను నమ్మించి చీట్ చేసింది.. దారుణంగా మోసపోయాను”.. ఫైమా గురించి సంచలన విషయాలను బయటపెట్టిన ప్రవీణ్…!!

ప్రవీణ్, ఫైమా మనందరికీ సుపరిచితమే. బుల్లితెర షోలతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఎన్నో వీడియోలు సైతం షేర్ చేశారు. ఈ విషయంల‌పై ప్రవీణ్ మొదటిసారి తన ప్రేమ గురించి రివీల్ చేశాడు. బిగ్బాస్ ఫైమాతో ప్రవీణ్ ప్రేమలో ఉన్నాడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు టీవీ స్టేజీలపైనే ధైర్యంగా చెప్పాడు. ఇవన్నీ చెప్పినా సరే ఫైమా నుంచి వ్యతిరేకత మాత్రం రాలేదు. కానీ అవన్నీ ఆడియన్స్‌ను మెప్పించడానికి చేసిన స్క్రిప్ట్స్‌ అని చెప్పుకున్నా.. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వారి సొంత యూట్యూబ్‌ చానల్స్‌లలో పలు వీడియోలు కూడా షేర్ చేశారు.

చివరకు ఫైమా వాళ్ల ఇంటికి కూడా పలుసార్లు వెళ్లేవాడు. ఆ సమయంలో ఫైమా వాళ్ల అమ్మని కూడా అత్తయ్య అని.. ప్రేమగా పిలిచేవాడట. ఇవన్నీ పక్కన పెడితే ఈ విషయాలన్నిటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ స్పందించాడు. ప్రవీణ్ మాట్లాడుతూ..” ఫైమాతో ప్రేమ అనేది ఫ్రెండ్షిప్ తో ప్రారంభమైంది. నా కెరీర్ ప్రారంభం నుంచి ఆమె ఉంది. అందుకే ప్రేమిస్తున్నానని చెప్పాను. దానికి ఆమె నో చెప్పింది. నా పరంగా చెప్పాల్సింది చెప్పాను. ఆమెకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు అది ఆమె ఇష్టం. అంతేకానీ ఆమె నో చెప్పిందని నేను ఎప్పుడూ ఆమెని అసభ్యంగా చూడలేదు ” అంటూ చెప్పాడు.

ప్రవీణ్ ఇంకా మాట్లాడుతూ.. ” మా మధ్య ప్రేమ లేకున్నా ఫ్రెండ్షిప్ మాత్రం చచ్చేవరకు అలానే ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో ఆమె నా ప్రేమ అంగీకరించలేదని చాలా కుమిలి కుమిలి ఏడ్చాను. ఫస్ట్ లవ్ ఇస్ బెస్ట్ లవ్ . అందుకే ఆమెని మర్చిపోలేక పోతున్నాను. కానీ ఆమె నన్ను మోసం చేసింది. ఇప్పటికిప్పుడు ఫైమా నన్ను ప్రేమిస్తున్నానని చెబితే.. ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను ” అంటూ ప్రవీణ్ చాలా చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇది విన్న ప్రేక్షకులు ” బిగ్బాస్ కి వెళ్లడంతో ఆమెకి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి… కాబట్టే ప్రవీణ్ ని రిజెక్ట్ చేసింది ” అంటూ మండిపడుతున్నారు.