పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆయన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ పలు భారీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సినిమా ” ఉస్తాద్ భగత్ సింగ్ ” లో కొద్దిరోజుల ముందటే జాయిన్ అయినా“““అ మళ్లీ చిన్న బ్రేక్ ఇచ్చారు.
ఇక ఈ గ్యాప్ లో పవన్ పాలిటిక్స్ పరంగా బిజీగా ఉన్నాడు. ఆయన కొద్ది రోజుల నుంచి బయట పెద్దగా కనిపించలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రిపేర్ చేసి ఉన్న లుక్ నుంచి ఇప్పుడు పవన్ బయటకి వస్తున్నట్లుగా లేటెస్ట్ పిక్స్ తో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే మళ్లీ క్లీన్ షేవ్ లోకి వచ్చేసారు.
దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఓజి సినిమాకు కూడా బ్రేక్ ఇచ్చినట్లే అనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ రెండు సినిమాల్లో దేనికి కూడా క్లీన్ షేవ్ లుక్ లో కనిపించింది లేదు. మరి ఇది ఏ సినిమా కోసం అనేది పక్కన పెడితే పవన్ ఫ్రెష్ లుక్ మాత్రం ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.