ఆ పాట వినగానే నాగిని డాన్స్ చేయాలనిపించింది.. శ్రీలీల కామెంట్స్ వైరల్..!

వైష్ణవ తేజ్ – శ్రీ లీల జంటగా నటిస్తున్న మూవీ ఆదికేశవ. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి రూపొందిస్తున్న ఈ మూవీకి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 10న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లీలమ్మో సాంగ్ ని బుధవారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరాల అందించిన ఈ సాంగ్ కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. నకాష్ అజీజ్, ఇంద్రావతి చౌహన్ పాటను ఆలపించారు.

శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట రిలీజ్ సందర్భంగా హీరో వైష్ణవ తేజ్, శ్రీ లీల, మూవీ డైరెక్టర్ శ్రీ‌కాంత్‌ మాట్లాడారు. దీనిలో భాగంగా వైష్ణవ తేజ్ మాట్లాడుతూ చిత్రీకరణంతా ఎంతో ఎంజాయ్ చేశానని రోజు సెట్ కళకళలాడుతూ ఉండేదని.. శ్రీ లీల.. సుదర్శన్ సెట్స్ కి వస్తే ఇంకా ఎక్కువ కలకలాడేదని చెప్పుకొచ్చాడు. ఇక మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రధమార్థమంతా వైష్ణవ్‌, శ్రీలీల, సుదర్శన్లతో ఎంతో సరదాగా సాగిపోతుంది. మాస్ యాక్షన్ ఉంటుంది ప్రేక్షకుల్ని సినిమా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని వివరించాడు.

అదేవిధంగా శ్రీ లీల మాట్లాడుతూ.. అమ్మవారి దసరా పూర్తయింది. నవంబర్ 10న శివుడు పేరుతో ఆదికేశవ మొదలవుతుంది.. ఈ లీలమ్మో సాంగ్ నాకు ఎంతో ఇష్టమైన పాట.. పైగా నా పేరుతో వ‌చ్చిన్న మొదటి పాట. అందుకే ఇది నాకు చాలా స్పెషల్ అంటూ వివరించింది. ఈ సాంగ్ ని అందరూ ఎంజాయ్ చేశ్తారు. వైష్ణవ్‌ అద్భుతంగా ఈ పాటకు డాన్స్ చేశాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది.. అసలు సిసలు మాస్ పాట అంటూ శ్రీలీల‌ చెప్పుకొచ్చింది. ఇది వినగానే నాకు నాగిని డాన్స్ చేయాలనిపించిందని.. ఆ రేంజ్ లో సాంగ్ ఉంటుందని వివరించింది శ్రీ‌లీల‌.