30 లక్షలు అడిగితే కోటిన్నర ఇప్పించిన‌ రజనీకాంత్.. అస‌లు ఏంజ‌రిగిందంటే.. ?

సూపర్ స్టార్ రజనీకాంత్, సౌందర్య, రామకృష్ణ కీలకపాత్రలో నటించిన మూవీ నరసింహ, మొదటి కోలివుడ్‌లో పాదయప్ప పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాతే తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక కేఎస్‌ రవికుమార్ డైరెక్షన్లో తెరకేక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ తండ్రిగా శివాజీ గణేషన్ నటించాడు. ర‌జినీ.. శివాజీ గణేషన్ కలిసి ఈ సినిమా కంటే ముందే చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్యన మంచి బాండింగ్ కూడా ఉందట.

వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా పాదయప్ప కావడం గమనార్హం. ఇక అప్పట్లో సినిమాలకు రమ్యనరేషన్ కేవలం లక్షల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడైతే లక్షలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పట్లో లక్షల్లో రెమ్యూనరేషన్ అంటేనే చాలా ఎక్కువ. అయితే శివాజీ గణేషన్ మొదట్లో రూ.20 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడట. అయితే పాదయప్ప‌ సినిమాకు మాత్రం ఆయన రూ.30 లక్షల రెమ్యూనరేషన్ కావాలంటూ డిమాండ్ చేశారట.

పర్సనల్ కారణాలతో ఆయన అలా అడిగి ఉంటాడ‌నే ఉద్దేశ్యంతో రజినీకాంత్ శివాజీ గణేషన్‌కు జీవితాంతం గుర్తుండిపోయేలాగా రెమ్యూనరేషన్ ఇప్పించాడట. పాదయప్ప‌ సినిమాకు ఏకంగా రూ.1.5 కోట్ల రెమ్యూనరేషన్ శివాజీ గణేషన్‌కు ముట్టెల చేశాడట రజనీకాంత్. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో కొట్టిన్న‌ర‌ చాలా ఎక్కువ. అంతేకాదు శివాజీ గణేషన్ జీవితంలోనే అత్యధికమైన రెమ్యూనరేషన్ కూడా అదేనట. అయితే 1999లో ఈ సినిమా రిలీజ్ కాగ‌ 2001లో శివాజీ గణేషన్ మ‌ర‌ణించారు.