తెలుగు స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన పాటతో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది. ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్లే బ్యాక్ సింగర్ కు కూడా అంతే గ్రేస్ ఉంటుంది. అలా ఇప్పటివరకు వేల పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది సునీత. ఇక ఈమె కెరీర్ విషయం పక్కన పెడితే.. గత రెండు సంవత్సరాల కితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఆ టైమ్ లో ఎన్ని విమర్శలు వచ్చిన లెక్కచేయనీ ఈమె.. ప్రస్తుతం తన జీవితాన్ని ఆనందంగా మలుచుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మొదటి భర్త కిరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీత అసలు ఎందుకు విడిపోయిందని సందేహాలు చాలామందిలో ఉంటాయి. మరి సునీత మొదటి భర్తతో విడిపోవడానికి కారణం ఎంటో..? చూద్దాం.
ఇంట్లో వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న కిరణ్, సునీత మధ్య పిల్లలు పుట్టిన తర్వాత గొడవలు మొదలయ్యాయట. దీంతో పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారిపై ఆ గొడవల ప్రభావం పడకూడదు అనూ ఉద్దేశ్యంతో సునీత.. కిరణ్‌కి విడాకులు ఇచ్చిందట. అప్పటినుంచి ఆమె ఒకటే పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ప్రస్తుతం సునీత సింగర్‌గా మంచి అవకాశాలు దక్కించుకుంటూ.. ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతుంది.