“ఒక్కసారి అనసూయతో అలా చేయాలని ఉంది” ..అనంత్ శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

జీ కుటుంబ అవార్డ్స్ 2023 సందడి అప్పుడే మొదలైపోయింది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలతో షోలో మరింత సందడి నెలకొంది. జయప్రద, నాచురల్ స్టార్ నాని, ఆర్జీవి, అనిల్ రావిపూడి, రేణు దేశాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు హాజరైన ఈ షోను.. రవి, శ్యామల హోస్ట్ చేస్తున్నారు. అయితే..జీ తెలుగు అవార్డ్స్ కు సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఒక్కొక్కరి పర్ఫామెన్స్ పీక్స్ లో ఉన్నాయి.

 

ముఖ్యంగా బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ డ్యాన్స్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ లో సౌందర్య నటించిన అంతఃపురం సినిమాలోని ” అసలేం గుర్తుకురాదు ” అనే సాంగ్కు తనదైన శైలిలో డాన్స్ చేసింది.

ఇక అనసూయ పర్ఫామెన్స్ అనంతరం.. గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తో కూడా భగవంత్ కేసరి సినిమాలో ” ఉయ్యాలో ఉయ్యాలో ” పాటకు డ్యాన్స్ చేసింది. అయితే.. ఆ సాంగ్ లో తండ్రి కూతురుని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తాడు. దీని గురించి అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ..” నాకు కూడా నిన్ను చేతిలో ఎత్తుకుని డ్యాన్స్ చెయ్యాలని ఉంది. అది నాకు కష్టం ఏం అనుకోకు ” అంటూ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.