ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు రెండు వివాహాలు చేసుకున్న.. తెలుగు నటులు వీళ్లే…!!

సినిమా రంగంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తరువాత విడాకులు తీసుకోవడం ఎంత సహజమో.. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా అంతే సహజం. ఇలాంటి వార్తలు బాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తుంటాయి. అదేవిధంగా మన టాలీవుడ్ లోనూ కొంతమంది హీరోలు రెండో పెళ్లి చేసుకున్నారు. అలా రెండు వివాహాలు చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నందమూరి తారకరామారావు:


ఈయన 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవతారకంను వివాహం ఆడారు. 1985లో అనారోగ్య కారణంగా బసవతారకం మరణించారు. అనంతరం 1993లో లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నారు.

2. కృష్ణంరాజు:


మొదట సీతా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. అనంతరం శ్యామల దేవిని వివాహం చేసుకున్నారు.

3. నాగార్జున:


ఈయన మొదట లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ తరువాత అమలను వివాహమాడాడు.

4. పవన్ కళ్యాణ్:


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటగా నందినిని వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2005లో రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం కూడా జన్మించారు. కొంతకాలానికి పవన్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి రష్యా నటి అన్నా లేజోనవా ను పెళ్లి చేసుకున్నాడు.

5. ప్రకాష్ రాజ్:


ఈయన మొదట లలిత కుమారి నీ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ముగ్గురు సంతానం కాగా ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అనంతరం పోనీ వర్మాను వివాహం చేసుకున్నాడు.

ఇలా ఈ ఐదుగురు రెండో వివాహం చేసుకుని రెండో పెళ్లి లిస్టులో చేరారు.