లూపులు లాగలేకపోయినా శివాజీ… అమర్ ప్రశ్నలకు బిక్క మొహం వేశాడు గా….!!

బిగ్ బాస్ నామినేషన్స్ ఎప్పుడు జరిగినట్టే హోరాహోరీగా జరిగాయి. శివాజీ ముఠా అంత సీరియల్ ముఠా ని టార్గెట్ చేశారు. ఈరోజు అది మళ్లీ క్లియర్ అయిపోయింది. అలానే అమర్ లాజిక్స్ మాట్లాడేసరికి శివాజీ దగ్గర సమాధానాలు లేక బిక్క మొఖం వేశాడు. నామినేషన్స్ అంటేనే ఊగిపోయే రైతు బిడ్డ దగ్గర ఈసారి మాత్రం కారణాలు లేవు. దీంతో ఎప్పటిలానే తన బ్యాచ్ కి విరుద్ధమైన అమర్ ని నామినేట్ చేశాడు. గతవారం మిర్చి దండ వేసావ్ అంటూ తేజాను సైతం నామినేట్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి పనులేం చేయకుండా.. పెద్దరికం పేరుతో కాళ్లు ఆర జాపి కూర్చుంటున్న శివాజీ సైతం అమర్ ని నామినేట్ చేశాడు. ఈయన అమర్ కి చెప్పిన కారణాలు ఏంటంటే..” గత వారం నువ్వు గట్టిగట్టిగా అరవడం, బూతులు తిట్టడం , సినిమా డైలాగులు చెప్పడం నాకు నచ్చలేదు అంటూ నామినేట్ చేశాడు. దీనికి బదులు ఇచ్చిన అమర్… మరి ప్రశాంత్ ఇలా అరిచాడు కదా అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదన్న? నాకైతే ఒక లెక్క.. ప్రశాంత్ కైతే ఇంకో లెక్క అని ప్రశ్నించాడు “.

దీనికి సమాధానం ఇచ్చేందుకు మాట్లాడిన శివాజీ.. ” వాడికి చాలాసార్లు చెప్పాను.. నేను నిన్న కూడా వాడికి చెప్పాను అంటూ అన్నాడు. అలాగే నాకు కూడా నామినేషన్ వేయకుండా నార్మల్గా చెప్పొచ్చు కదా. ప్రశాంత్ అంటే మీకు ఇష్టం కాబట్టి పర్సనల్ గా చెప్పుకుంటారు. నేనంటే మీకు మొదటి వారం నుంచే పడదు.. ఎందుకో నాకు తెలియదు. అంటూ అమర్ ప్రశ్నించడంతో.. శివాజీకి మాటలు ఒక్కటే కరువయ్యాయి “. ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు ” శివాజీ బిగ్ బాస్ హౌస్ కి అమర్ ని సాధించడానికి వెళ్ళాడా. ఆయనకి తిండి దండగ.. తప్ప ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.