అనుష్క నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా… మెంటల్ ఎక్కిపోతాది…!!

అనుష్క శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షక అభిమానుల ఆదరణ పొందింది. తాజాగా ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమా అనంతరం అనుష్క నుంచి మరో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ వినిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అనుష్క శెట్టి ఓ లేడీ ఓరియంటెడ్.. సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. మన టాలీవుడ్ కి చెందిన డైరెక్టర్ తోనే ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అన్ని సవ్యంగా జరిగితే త్వరలోనే వీళ్ళ కాంబోపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి వేరే లెవల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ప్రజెంట్ ఈ న్యూస్ అనుష్క అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. అనుష్క నుంచి మళ్లీ అరుంధతి సినిమా లాంటి సినిమా రాబోతుంది అంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. మా స్వీటీ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.