నవీన్ చంద్ర భార్య గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులలో నవీన్ చంద్ర ఒకడు. అందాల రాక్షసి, అరవింద సమేత లాంటి అనేక సినిమాలతో గుర్తింపు సొంతం చేసుకున్న నవీన్ చంద్ర ” మంత్ ఆఫ్ మధు ” సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల‌ ముందుకి రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా.. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్రైలర్ కు దాదాపు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే నవీన్ చంద్ర భార్య గురించి అభిమానులకి పెద్దగా తెలియకపోవచ్చు. నవీన్ చంద్ర భార్య పేరు ఓర్మా కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది ప్రేమికుల రోజున సోషల్ మీడియా వేదికగా నవీన్ చంద్ర తన భార్యను పరిచయం చేశాడు. ఓర్మ స్వస్థలం కేరళ కాగా ఈమె నవీన్ చంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న నవీన్ చంద్ర కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు.

నా సక్సెస్ వెనుక నా భార్య ఉందని నవీన్ చంద్ర కామెంట్స్ చేశాడు. ఓర్మా ప్రముఖ మలయాల్ దర్శకుడు సిద్ధిఖ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారని నా సినిమాల కథల ఎంపికలో కూడా తన వంతు సహకారం అందిస్తుందని నవీన్ చంద్ర అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓర్మ భవిష్యత్తులో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని నవీన్ చంద్ర ఓ సంద‌ర్భంలో అన్నాడ‌ట‌. మరి ఈ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి.