దేత్తడి హారిక ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఓ యూట్యూబ్ స్టార్. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో కూడా ఓ వెలుగు వెలిగింది. అయితే ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. ఈమె చేసే ప్రతి వీడియోకు చాలా వ్యూస్ వచ్చేవి. అదే క్రేజ్ ఈమెను బిగ్ బాస్ షో కి తీసుకెళ్లేలా చేసింది. అయినప్పటికీ ఆమె బుల్లితెరకు మాత్రం దూరంగానే ఉంది. కానీ ఇప్పుడు ఈమెకు మంచి ఆఫర్ వచ్చిందట. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని కొద్దికాలం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
యంగ్ హీరో సంతోష్ శోభన్ తో దేత్తడి హారిక ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా ఈమెకు ఇది మొదటి సినిమా. అయితే ఈ సినిమాని బేబీ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్ కేఎన్, డైరెక్టర్ రాజేష్ కలిసి తీస్తున్నట్లు సమాచారం. సాయి రాజేష్ ఇప్పటికే బేబీ సినిమాతో యూట్యూబర్ అయిన వైష్ణవి చైతన్యకు లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి తన సినిమాలో ఇంకో తెలుగు యూట్యూబర్ను తీసుకోవడం ద్వారా మరో హీరోయిన్ ని టాలీవుడ్ కు అందిస్తున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు.
తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. చిన్న సినిమాలకు బెస్ట్ ఆప్షన్ సంతోష్ శోభన్. అతనితో సినిమా చేస్తే మినిమమ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఇక హారికా కి మాత్రం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యి.. మంచి హిట్ పడితే హారిక కెరీర్ మారిపోతుంది అనే చెప్పాలి.