భార్య స్నేహ కోసం తనకు ఎంతో ఇష్టమైనదాన్ని త్యాగం చేసిన బన్నీ.. సో స్వీట్ పర్సన్ అంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ పాపులర్ కి దక్కించుకున్న స్టార్ కపుల్ లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఒకరు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బన్నీ భార్య స్నేహ ఎటువంటి సినిమాల్లో నటించకపోయినా ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్లో దర్శనమిస్తూ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియా వేదికగా కోట్లాదిమంది ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే ప్రస్తుతం స్టార్ కపుల్ గా వెలిగిపోతున్న ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా వీరి పెళ్లికి ముందు బన్నీ.. స్నేహ కోసం తనకు ఎంతో ఇష్టమైన దాన్ని త్యాగం చేశాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక గతంలో స్నేహ రెడ్డిని పబ్ లో చూసిన బన్నీ వెంటనే ఆమెకు ఫిదా అయ్యి ప్రపోజ్ చేశాడట, దీంతో కాస్త టైం తీసుకున్న స్నేహ బన్నీ బిహేవియర్ నచ్చడంతో కొన్ని కండిషన్స్ పెట్టి లవ్ కు ఓకే చెప్పిందట.. ఆ కండిషన్స్ లో ఒకటే ఇది. అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు చాలా స్టైలిష్ గా కనిపిస్తూ కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటాడు. అయితే స్నేహ కలిసిన టైం లో అల్లు అర్జున్ జుట్టు మొత్తం చింపిరి చింపిరిగా చేసుకొని ఎక్కువగా పెంచుకునే వాడు.

అప్పట్లో ఆయనకు ఆ స్టైల్ అంటే ఎంతగానో ఇష్టమట. కానీ స్నేహకి డిగ్నిటీగా ఉండడం అంటే చాలా ఇష్టం. అలా చింపిరి జుట్టు వేసుకుని ఉన్న బన్నీని చూసి హెయిర్ కట్ చేయించుకుని రమ్మని సజెస్ట్ చేసిందట. బన్నీకి ఎంతో ఇష్టమైన హెయిర్ హెయిర్ స్టైల్ ను తనకు నచ్చకపోయినా స్నేహ కోసం కట్ చేపించేసుకున్నాడు. దీంతో స్నేహ కూడా బన్నీని మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం అతని ప్రేమించడం స్టార్ట్ చేసింది. తర్వాత వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో భార్య కోసం తమ‌కు ఇష్టమైన దాన్ని త్యాగం చేయడం చాలా రేర్‌గా జరుగుతూ ఉంటుంది. అలాంటిది స్నేహాన్ని చెప్పిన వెంట‌నే తనకు నచ్చకపోయినా హెయిర్ కట్ చేసుకున్నాడంటే బన్నీ ఎంత స్వీట్ పర్సనో అర్థమయిపోతుంది. అంతలా అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే ఎవరైనా ఓకే చేయాల్సిందే.. బ‌న్ని సో స్విట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.