సరికొత్తగా ఆకట్టుకుంటున్న ఆయాలాన్ టీజర్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన నటుడు శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న చిత్రం ఆయలాన్.. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది డైరెక్టర్ ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది .ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను కేవలం హిందీ ఇంగ్లీష్ వంటి భాషలలో మాత్రమే చూశాము..ఇప్పుడు మొదటిసారి శివ కార్తికేయన్ తమిళ సినిమాతో ప్రయోగం చేయబోతున్నారు. ఈ సినిమా కూడా తెలుగులో అదే పేరుతో డబ్ విడుదల కాబోతోంది.

Ayalaan Teaser: A Glimpse At Sivakarthikeyan and His Alien Friend

ఇటీవలే టీజర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయక ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో శివ కార్తికేయన్ ఒక సాధారణ రైతుగా కనిపిస్తున్నారు.. డబ్బు కోసం పేరు కోసం ఒక విలన్ తన ల్యాబ్లో తయారుచేసిన ప్రయోగం వల్ల వాతావరణం ఒక్కసారిగా మార్పులు కనిపిస్తాయి వాటి వల్లనే భూమి అంతమయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతోంది అంటూ టీజర్ మొదలవుతుంది.. ఈ మార్పుల వలన ఒక ఏలియన్ భూమి మీదికి వస్తుంది అది శివ కార్తికేయంతో కలిసి ఉంటున్నట్లుగా చూపించారు.

అసలు ఏలియన్ ఎందుకు వచ్చింది ఏలియన్ తో కలిసి ఈ హీరో ఎలాంటి ప్రయోగాన్ని అడ్డుకున్నాడు అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించాడు. ఇక ఏలియన్తో శివ కార్తికేయన్ యోగి బాబు చేసిన కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకి మరింత ప్లస్ కాబోతున్నాయి. మరి సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.