‘ కుక్కలా తిరిగావని అవకాశం ఇస్తే.. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ ‘.. ప్రశాంత్ పై ఫైర్ అయిన రతిక..!!

బిగ్ బాస్ 7 రెండో వారం నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసే వాళ్లు ముందుకు రండి అంటూ బిగ్ బాస్ చెప్పగా.. గౌతమ్, ప్రియాంకా జైన్ , అమర్ దీప్ చౌదరి, సింగర్ దామిని, షకీలా వచ్చారు. దీనితో అసలైన ఆట మొదలయింది. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ వార్ మధ్యలో సందీప్ తగులుకొని ప్రతి ఒక్కడు రైతు బిడ్డే.. మా తాతలు కూడా రైతులే అని ఫైర్ అయ్యాడు.

ఆ తర్వాత ప్రశాంత్ 6 సీజన్ మొదలయ్యే సమయంలో నేను బిగ్ బాస్ స్టూడియో ముందు కుక్కలా తిరిగా అన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో రితిక మధ్యలో ‘ మరి కుక్కలా తిరిగిన నీకు అవకాశం ఇస్తే.. ఇక్కడ కొచ్చి ఏం చేస్తున్నావ్ ‘ అంటూ ప్రశాంత్ మీద ఫైర్ అయ్యింది.

అయితే ఇక్కడ అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్ ని కరెక్ట్ ప్రశ్నలు అడిగి ఉండొచ్చు కానీ మరీ ఇంత దారుణంగా అడగటం సరైన పద్ధతి కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఎవడి ఇష్టం వాడిది.. రైతు బిడ్డనని చెప్పుకోవడం అది తన ఇష్టం. దీన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అమర్దీప్ కరెక్ట్ గా అడిగాడు అంటూ పొగుడుతున్నారు.