బిగ్ బాస్ నామినేషన్ డే లో తొడగొట్టిన రైతు బిడ్డ.. ఫయిర్ అయిన అమరదీప్, ప్రియాంక..

బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచి రసవాత్రంగా పోరు సాగుతుంది. ఈ సీజన్లో నామినేషన్ ప్రక్రియ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ వారం ఆట సందీప్ ఇమ్యూనిటీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి అతని నామినేట్ చేయడానికి లేదు అయితే ఈసారి నామినేషన్ విధానాన్ని కూడా మార్చడు బిగ్ బాస్. ఒక కంటెస్టెంట్ ని ఎంతమంది నామినేట్ చేయాలంటున్నారో బయటకు రావాలని అడుగుతున్నారు. అయితే ఆట సందీప్ కూడా ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ప్రిన్స్ రోవర్ హౌస్ లో ఉండేందుకు అర్హుడు కాదని ఆట సందీప్ నామినేట్ చేశాడు.

నాగార్జున కూడా నాకు మార్క్స్ వచ్చాయని చెప్పారు.. నాకంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను అర్హుడిని కాదని నన్నెలా నామినేట్ చేస్తారు అంటూ ప్రిన్స్ ఆర్గ్యుమెంట్ చేశాడు. తర్వాత తేజను నామినేట్ చేసే వాళ్ళు ఎవరు అని అడగగ శుభశ్రీ, రితిక రోజ్, పల్లవి ప్రశాంత్ ముందుకు వచ్చి రీజన్ లు చెప్పి టేస్టీ తేజను నామినేట్ చేశారు. తర్వాత దామిని పేరు పిలిచారు బిగ్ బాస్.. అయితే ఆమెను నామినేట్ చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. దాంతో ఆమె ఈ వారం నామినేషన్ నుండి తప్పుకుంది. తర్వాత నటుడు శివాజీ పేరు పిలిచారు. మొత్తం 5 మంది శివాజీని నామినేట్ చేశారు. అమర్దీప్ చౌదరి, ప్రియాంక, షకీలా, దామిని, శోభశెట్టి వచ్చారు.

వీరిలో ప్రియాంక సింగ్, శివాజీ మధ్య వాడి వేడి చర్చలు కొనసాగాయి. ఇక పల్లవి ప్రశాంత్ పేరు పిలవగా గౌతమ్ కృష్ణ, ప్రియాంక సింగ్, అమర్ దీప్ రంగంలోకి దిగారు. పల్లవి ప్రశాంత్ ని ప్రియాంక, అమరదీప్ స్ట్రాంగ్ గా టార్గెట్ చేశారు. నువ్వు రైతుబిడ్డ అని చెప్పుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా వీరిద్దరూ వాదించారు. రైతులే కాదు అన్ని రంగాల్లో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ సింపతి యాంగిల్ తో మార్క్స్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అమర్, ప్రియాంక భావించారు. ఎలాగైనా ఆ సింపతి యాంగిల్ ని దూరం చేయాలని గట్టిగా ప్రయత్నించారు. ఇలా హాఫ్ ఎలిమినేషన్ తో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. ఇంక నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటారు అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది.