వీళ్లేంటి ఇలా తయారయ్యారు.. బిగ్ బాస్ హౌస్ లో వింత షో..!!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. అన్ని భాషల్లోనూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ షో ప్రస్తుతం తెలుగులో మాత్రం7వ‌ సీజన్ ప్రసారమవుతుంది. ఈ షోలో భాగంగా ఇప్పటికే మూడు వారాలు పూర్తయిన.. త్వరలో 4వ వారం కూడా పూర్తవ్వనుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే ముగ్గురు కంటిస్టేన్స్ బయటకు వెళ్లిపోయారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఒక గాల ఈవెంట్ నిర్వహించాడు.

ఈ క్రమంలో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా రకరకాలుగా తయారయ్యి ప్రేక్షకులని మెప్పించాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ అందరూ కూడా వింతగా తయారయ్యారు. ఈవెంట్లో భాగంగా ప్రియాంక రాక్షసి లాగా తయారయ్యి సందడి చేసింది.

అలాగే టేస్టీ తేజ తన పేరుకు తగ్గట్టుగానే కూరగాయలతో రెడీ అయ్యాడు. ఈ విధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కో విధంగా తయారయ్యారు. ఇక ఈ గాల ఈవెంట్లో ఆట సందీప్, శోభ శెట్టి యాంకర్లుగా కొనసాగించారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా కంటిస్టెంట్లతో బిగ్ బాస్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించిందని చెప్పాలి.